Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

సెల్వి
సోమవారం, 23 జూన్ 2025 (13:02 IST)
Pawan Kalyan
జూన్ 22, 2025న తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగ భక్తరగల్ మానాడు (మురుగన్ భక్తుల సదస్సు)లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అదే రోజు మధురై విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ఇతర బిజెపి నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. 
 
ఆయన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేస్తూ సనాతన ధర్మం, సాంప్రదాయ సాంస్కృతిక విలువల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ నుండి దాదాపు ఐదు లక్షల మంది భక్తులు భారీగా హాజరయ్యారు. ఇకపోతే.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ నుండి విరామం తీసుకున్నాడు.
అలాగే ఆదివారం మధురైలో జరిగిన భారీ మురుగన్ భక్తుల సమావేశంలో తమిళనాడు అంతటా వేలాది మంది భక్తులు 'కంధ షష్టి కవసం'ను జపిస్తూ, హిందూ సంస్కృతి, మతం, సంప్రదాయాలను రక్షించడం, ప్రోత్సహించడం లక్ష్యంగా ఆరు కీలక తీర్మానాలను ఆమోదించారు. 
 
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులు, మురుగన్ భక్తులు ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రారంభమై కంద షష్టి కవసం యొక్క పెద్ద ఎత్తున పారాయణంతో ముగిసింది. 
 
 
తమిళనాడులో మురుగన్ సమావేశం ఎందుకు జరుగుతుందో అడగడం తమిళ సంస్కృతి ఆత్మను ప్రశ్నించడం లాంటిది. మన దేవుళ్ళు, మన దేవాలయాలు, మన ధర్మాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments