Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు కోసం బ్యాంకుకు డెడ్‌బాడీ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:20 IST)
ఓ వ్యక్తి చనిపోయాడు. కానీ, అతని ఖాతాలో ఉన్న డబ్బును చెల్లించేందుకు బ్యాంకు మేనేజరు అంగీకరించలేదు. దీంతో మృతదేహన్ని బ్యాంకుకు తీసుకొచ్చారు. డెడ్‌బాడీ ఇదిగోండి.. ఇప్పటికైనా డబ్బులు చెల్లించండి అంటూ, ఆ డబ్బుతో అంత్యక్రియలు చేయాలి అంటూ చుట్టుపక్కల వారు కోరారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నా పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాట్నా పరిధిలోని సిగరియావా గ్రామానికి చెందిన మహేష్ యాదవ్(55) అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఈయనకు బంధువులు, చుట్టాలు, తోడపుట్టినవారు ఇలా ఎవ్వరూ లేదు. ఆయనకు ఆ గ్రామస్థులే అన్నీ చూస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన మృతి చెందాడు. దీంతో అతని అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు కావాల్సి వచ్చింది. 
 
ఏం చేయాలో పాలుపోని ఊరి గ్రామస్తులు స్థానికంగా ఉన్న బ్యాంక్ దగ్గరకు వెళ్లారు. బాధితుడి బ్యాంకు ఖాతాలో డబ్బులు ఏమైనా ఉన్నాయో చెక్ చేయాలని బ్యాంక్ అధికారుల్ని కోరారు. బాధితుడి ఖాతాను తనిఖీ చేసిన అధికారులకు.. అకౌంట్‌లో లక్షరూపాయలున్నాయి. డబ్బులు ఇచ్చేది లేదంటూ బ్యాంక్ మేనేజర్ తిరస్కరించారు. పైగా కనికరం లేకుండా మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ తిప్పి పంపించాడు. 
 
ఇలా అడిగితే డబ్బులు ఇవ్వరు. ఏం చేస్తే డబ్బులిస్తారో మాకు బాగా తెలుసంటూ ఆవేదన వ్యక్తం చేసిన గ్రామస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడి మృతదేహాన్ని నేరుగా బ్యాంకుకు తీసుకొచ్చారు. మేనేజర్‌గారు బ్యాంక్‌కు డెడ్ బాడీ వచ్చింది.. ఇప్పుడైనా మా డబ్బులు మాకిస్తారా అంటూ మొండికేసి మృతదేహాన్ని అక్కడే ఉంచారు. 
 
అలా మూడు గంటల పాటు మహేష్ మృతదేహం బ్యాంక్‌లోనే ఉంచారు. బ్యాంక్ మేనేజర్ ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు అతని మాట వినిలేదు. దీంతో చేసేదేమీ లేక చివరకు బ్యాంక్ మేనేజరే తన జేబులో ఉన్న డబ్బుల్ని వారికిచ్చి పంపించారు. అయితే అతని బ్యాంకు ఖాతాలో లక్షరూపాయలున్నాయ్. కానీ బ్యాంక్ ఖాతాకు నామినీ ఎవరూ లేరు. అందుకే బ్యాంక్ మేనేజర్ డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments