Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిరిండియా విమానంలో ప్రయాణికుల ముక్కుల నుంచి రక్తం... ఎందుకంటే?

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:23 IST)
ఎయిరిండియా సంస్థకు చెందిన ఓ విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. క్యాబిన్‌లో పీడన సమస్య కారణంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. మస్కట్ నుండి కాలికట్ బయల్దేరిన విమానంలో పీడనం తగ్గడంతో కొందరు ప్రయాణికులకు ముక్కు నుండి రక్తస్రావం కాగా, మరికొంత మంది చెవి నొప్పితో బాధపడ్డారు. 
 
185 మంది ప్రయాణికులు, సిబ్బందితో పాటుగా ఆదివారం మస్కట్ ఎయిర్‌పోర్ట్ నుండి కాలికట్ బయల్దేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులోని ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మస్కట్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. 
 
ప్రయాణికులలో నలుగురికి ముక్కు నుంచి రక్తస్రావం కాగా, మరికొంత మంది చెవి నొప్పితో ఇబ్బందిపడ్డారు. వారందరికీ విమానాశ్రయంలో చికిత్స అందించారు. వారు కోలుకున్న తర్వాత విమానం కాలికట్ బయల్దేరింది. ప్రయాణికులలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments