ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చాం.. కానీ మోదీ సర్కారు?: మన్మోహన్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రధాన మంత్రి హోదాలో తాను హామీ ఇచ్చానని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గుర్తు చేశారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో మన్మోహన్ సిం

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (17:46 IST)
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పట్లో ప్రధాన మంత్రి హోదాలో తాను హామీ ఇచ్చానని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గుర్తు చేశారు. విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాజ్యసభలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. తామిచ్చిన హామీలను తర్వాతి సర్కారు అమలు చేయలేదని.. తద్వారా హోదా హామీ నీరుగారిపోయిందని చెప్పారు. అయినా నాడు పార్లమెంట్ లో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.  
 
సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ, రెండు రాష్ట్రాలు అన్నదమ్ముళ్లా విడిపోవాలని తమ పార్టీ కోరుకుందని, నాడు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి పదేళ్ల హోదా కావాలని నాడు అరుణ్ జైట్లీ అన్నారని, నేడు ఆర్థిక మంత్రి కాగానే ఆ విషయం మర్చిపోయారని, 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతున్నారని దుయ్యబట్టారు.
 
సీపీఎం ఎంపీ రంగరాజన్ మాట్లాడుతూ, విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీదేనని, చెన్నైలో 25 శాతం మంది తెలుగువాళ్లు ఉన్నారని, ఏపీ కష్టాలు తమకు తెలుసునని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments