Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి రోజు నుంచి కొత్త భవనంలో పార్లమెంట్ సమావేశాలు

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (15:52 IST)
ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రారంభ సమావేశాలు మాత్రం అంటే 18వ తేదీన జరిగే సమావేశంలో పాత భవనంలో ప్రారంభించి, ఆ తర్వాత రోజు నుంచి కొత్త భవనంలో నిర్వహించనున్నారు. 
 
మరోవైపు, ఈ ప్రత్యేక సమావేశాల అజెండాను బహిర్గతం చేయాలంటూ విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పెదవి విప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. 
 
'సెప్టెంబర్ 18న పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అవుతాయి. వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనంలోకి మార్చనున్నారు" అని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ వెల్లడించింది. 
 
మన దేశంలో పార్లమెంటు "ప్రత్యేక సమావేశాలు" చాలా అరుదుగా జరుగుతుంటాయి. స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తిచేసుకునే దిశగా భారత్‌ అడుగులు వేస్తున్న "అమృత్‌ కాలం"లో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేశారు. ఆ సందర్భంగా జరిగే చర్చలు ఫలవంతం కావాలని కేంద్రం ఆశిస్తున్నట్లు ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments