Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సామాజిక కార్యకర్త శాంతిదేవి కన్నుమూత

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (15:11 IST)
ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత శాంతిదేవి కన్నుమూశారు. ఒరిస్సా రాష్ట్రంలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 యేళ్లు. కోరాపుట్‌ జిల్లాలో గిరిజన తెగకు చెందిన యువతుల అభివృద్ధి, జీవన ప్రమాణాల పెంపు కోసం ఆమె ఎంతగానో కృషి చేశారు. 
 
అంతేకాకుండా, అనాథులు, పేద పిల్లలు, అభాగ్యుల కోసం 1964లో గుణపురంలో సేవా సమాజ్ ఆశ్రమాన్ని ఆమె ప్రారంభించారు. విద్య, వొకేషనల్ కోర్సుల కోసం ఆమె ఆశ్రయాన్ని కూడా ఓపెన్ చేశారు. గిరిజన యువతులకు విద్యాభ్యాసం కోసం ఆమె అనేక స్కూల్స్‌ను తెరిచారు. 
 
ఆమె సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో పాటు జమునాలాల్ బజాజ్, రాధానాథ్ రథ్‌పీస్ అవార్డులను ఆమె గెలుచుకున్నారు. శాంతిదేవి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీతో సంతాపం  తెలిపారు. అణగారిన వర్గాల ప్రజల గొంతుకగా ఆమె నిలిచివున్నారని కొనియాడారు. 
 
ఆరోగ్యకర సమాజం కోసం అవిశ్రాంతంగా ఆమె పోరాటం చేసినట్టు మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. శాంతిదేవి కుటుంబ సభ్యులకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments