Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్లదాడి

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (13:09 IST)
ఢిల్లీలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై కొందరు దుండగులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
 
జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన తన ఇంటిపై రాళ్లదాడి జరిగినట్టు గుర్తించారు. ఆ తర్వాత వీడియో తీసి ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని తన నివాసంపై మరోమారు దాడి జరిగిందని, గత 2014 తర్వాత ఈ తరహా దాడి జరగడం ఇది నాలుగోసారి అని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డీసీపీ సారథ్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments