బెంగుళూరులో దారుణం - ఐఫోన్ కొనేందుకు డబ్బులు లేక డెలివరీ బాయ్‌ హత్య

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (12:46 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఈ-మార్కెటింగ్ వెబ్‌సైట్‌లో ఐఫోన్ బుక్ చేసిన ఓ వ్యక్తి.. దానికి డబ్బులు చెల్లించలేక డెలివరీ బాయ్‌ను హత్య చేసిన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని హాసన్ జిల్లాలోని అంచ్ కొప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ నెల 11వ తేదీన కాలిన శరీరాన్ని ఒకటి వెలుగు చూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడిని హేమంత్ నాయక్ (20)గా గుర్తించారు. ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. 
 
లక్ష్మీపుర లే ఔట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా అనే వ్యక్తి సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ను బుక్ చేసుకున్నాడు. దాన్ని డెలివరీ చేసేందుకు హేమంత్ నాయక్ ఈ నెల 7వ తేదీన హేమంత్ దత్తా ఇంటికి వచ్చాడు. ఫోన్ డెలివరీ చేసేందుకు రూ.46 వేలు చెల్లించాలని కోరాడు. అంత డబ్బు తన వద్ద లేకపోవడంతో డెలీవరీ బాయ్‌ను హేమంత్ దత్తా కత్తితో పొడిచాడు. 
 
ఆ తర్వాత మృతదేహాన్ని ప్యాక్ చేసి ద్విచక్రవాహనంపై పెట్టుకుని రైల్వే స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసి దహనం చేసినట్టు పోలీసులు జరిపిన విచారణలో వెల్లడైంది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఈ కేసులోని మిస్టరీని ఛేదించారు. దీంతో హేమంత్ దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments