Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోడీకి భారీగా బహుమతులు.. వేలం పాటలు ప్రారంభం...

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (11:07 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను వేలం వేయాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. పారిలింపిక్స్ విజేతలు ఇచ్చిన స్పోర్ట్స్ షూ మొదలుకొని వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి 600 రకాల వస్తువులు వేలం వేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వేలం వేస్తున్న వస్తువుల్లో రూ.600ల నుంచి రూ.8.26 లక్షలు విలువ చేసేవి ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజైన సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. 
 
సోమవారం మంత్రి షెకావత్ వేలం వేసే వస్తువులు ప్రదర్శనశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ప్రధాని మోడీ తనకు లభించే అన్ని బహుమతులను వేలం వేసే కొత్త సంస్కృతిని ప్రారంభించారన్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఇలానే చేసేవారని తెలిపారు. ఇలా వేలం నిర్వహించడం ఇది ఆరోసారని వెల్లడించారు. బహుమతుల వేలం ద్వారా వచ్చే డబ్బును గంగానది ప్రక్షాళనకుగానూ గంగాధికి విరాళంగా అందజేస్తామని ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments