Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ - త్వరలోనే ఆఫర్ల వెల్లడి

ఠాగూర్
మంగళవారం, 17 సెప్టెంబరు 2024 (10:47 IST)
దేశ వ్యాప్తంగా పండగ సీజన్ మొదలైంది. ఇలాంటి సమయంలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునేందుకు వీలుగా పలు ఈ-కామర్స్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇలాంటి వాటిలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలు ప్రత్యేక ఆఫర్లకు తెరలేపాయి. ఇందులోభాగంగా, ఫ్లిప్‌కార్ట్ సంస్థ తాజాగా బిగ్ బిలియన్ డేస్ 2024 పేరుతో ఓ సేల్‌ను ప్రకటించింది. ఈ నెల 27వ తేదీ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలు కానుందని వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈసారి సేల్స్‌లో కస్టమర్లు భారీ ఆఫర్స్ పొందే అవకాశం ఉంది. త్వరలోనే ఆ ఆఫర్ల వివరాలు వెల్లడికానున్నాయి. 
 
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, దుస్తులు, ఏవైనా గృహోపకరణాలను షాపింగ్ చేయాలనే ప్లాన్లో ఉన్నవారికి 'బిగ్ బిలియన్ డేస్' సేల్స్ బాగా ఉపయోగపడతాయనే చెప్పచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సందర్భంగా అన్ని విభాగాల్లో భారీ తగ్గింపులు ఉంటాయని సమాచారం. స్మార్ట్ టీవీలతో పాటు గృహోపకరణాలపై ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 80 శాతం వరకు తగ్గింపును అందించే అవకాశం ఉంది. ల్యాప్‌టాప్‌లు, హెడ్ ఫోన్లు, గేమింగ్ పరికాలు, గాడ్జెట్ పరికరాలపై 50 శాతం నుంచి 80 శాతం వరకు తగ్గింపు లభించనుంది. రిఫ్రిజిరేటర్లు, 4కే స్మార్ట్ టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై 75 శాతం భారీ తగ్గింపు లభించే అవకాశం ఉంది. ఇక స్మార్ట్‌ఫోన్లలో నథింగ్, రియల్మీ, ఇన్ఫినిక్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ గణనీయమైన తగ్గింపులతో రానున్నాయి.
 
కొన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై పరిమిత కాల వ్యవధిలో బహుళ బ్యాంక్ ఆఫర్లు ఉంటాయి. ఒకవేళ మీరు ఐఫోన్ వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే ప్లాన్లో ఉంటే.. మీకు ఈ ప్లాట్‌ఫారమ్‌‍లో కొన్ని అదనపు ఆఫర్లను పొందే అవకాశం ఉంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

పెళ్లి కాని ప్రసాద్ టీజర్ చూసి ఎంజాయ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments