Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-సిగిరెట్లు ప్రమాదకరం అంటూ ప్రధానికి లేఖ రాసిన వైద్యులు

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:53 IST)
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. పొగాకు కూడా ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని డాక్టర్లు అనేక సందర్భాల్లో తెలిపారు. అలాంటి తరుణంలో వీటికి బదులు ఈ-సిగిరెట్లు వచ్చాయి. చూడడానికి స్టైలిష్‌గా ఉంటాయి. తాగికే కిక్కు ఉంటుంది. వీటిలో పొగాకు ఉండదు కదా? మరి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదులే అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా? అయితే వీటి వల్ల చాలా ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. ఈ మేరకు 27 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన వెయ్యి మందికి పైగా డాక్టర్లు ప్రధాని మోడీకి లేఖను రాశారు.
 
ఎలక్ట్రానిక్ నికోటిన్‌ డెలివరీ సిస్టం (ఈఎన్‌డీఎస్)తో కూడిన ఈ-సిగరెట్లు, ఈ-హుక్కాలతోపాటు విరివిగా దొరుకుతున్న వేప్‌, వేప్‌ పెన్‌లాంటి వస్తువులు ఆరోగ్యానికి ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. ఈ-సిగరెట్లను నిషేధించాలని గతేడాది కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ అన్ని రాష్ట్రాల్లో పూర్తిగా అమలు కావట్లేదని, విరివిగా ఈ-సిగిరెట్లు మార్కెట్లో లభిస్తున్నాయని వైద్యులు తమ లేఖలో పేర్కొన్నారు.
 
దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీయువకులు అందులో ముఖ్యంగా టీనేజర్లు ఈ-సిగిరెట్లకు ఎక్కువ అలవాటుపడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా ఇది పొగ బయటకు వదలదు. అందువల్ల ఈ-సిగిరెట్లు తాగేవాళ్లను గుర్తించడం కష్టం. అయితే సాధారణ సిగరెట్లతో ఎంతటి ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందో, అంతకుమించి ఈ-సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచంలో ఇప్పటికే 36దేశాలు ఈ-సిగరెట్లను బ్యాన్ చేశాయి. ఈ-సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే. కాగా గత మార్చిలో కూడా ప్రధానికి డాక్టర్లు ఇదే విషయమై లేఖను రాశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments