Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణబ్‌జీ... మా అమ్మను చంపేశారు.. నిజ నిర్ధారణ చేయించండి : పన్నీర్ వర్గ ఎంపీలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను కొందరు చంపేశారనీ, ఈ విషయంలో నిజనిర్ధారణ జరిపించాలంటూ అన్నాడీఎంకేకు చెందిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులైన 12 మంది ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు రాష్ట్రపతి ప్ర

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (10:52 IST)
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలితను కొందరు చంపేశారనీ, ఈ విషయంలో నిజనిర్ధారణ జరిపించాలంటూ అన్నాడీఎంకేకు చెందిన మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గీయులైన 12 మంది ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కలిసి వినతి పత్రం సమర్పించారు. 
 
రాజ్యసభ ఎంపీ మైత్రేయన్ నేతృత్వంలోని 12 మంది ఎంపీల బృందం మంగళవారం ప్రణబ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించింది. జయలలితకు ఆస్పత్రిలో చేసిన చికిత్సకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయాలని కోరారు. 
 
72 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయమ్మను చూసేందుకు ఏ ఒక్కరినీ అనుమతించలేదని వారు గుర్తుచేశారు. పైగా, అమ్మకు పెట్టిన వెంటిలేటర్‌ను సైతం తొలగించారనీ, దాన్ని ఎవరి అనుమతితో తొలగించారో తేల్చాలని వారు డిమాండ్ చేశారు. 
 
ఇకపోతే శాసనసభలో ప్రతిపక్షాలు లేకుండానే పళని స్వామి బలపరీక్ష నెగ్గినట్టు స్పీకర్ ప్రకటించారని, కాబట్టి విశ్వాస పరీక్షను రద్దు చేసి రహస్య ఓటింగ్‌కు ఆదేశించాలని వినతిపత్రంలో కోరారు.
 
దాదాపు అరగంటపాటు ప్రణబ్‌తో భేటీ అయిన ఎంపీలు జయ మృతిపై తమకున్న అనుమానాల గురించి ఆయనకు వివరించారు. అనంతరం మైత్రేయన్ విలేకరులతో మాట్లాడారు. జయ ఆస్పత్రిలో చేరడానికి ముందు పోయెస్‌గార్డెన్‌లో ఏం జరిగిందో చెప్పాలని శశికళను డిమాండ్ చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments