Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా గడ్డ నుంచి 10 లక్షల మందిని తరిమికొడతా : డోనాల్డ్ ట్రంప్ తాజా వార్నింగ్

అమెరికా గడ్డపై నివశిస్తున్న పరాయి దేశస్థుల్లో దాదాపు పది లక్షల మందిని తరిమికొడతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. వీరి స్థానంలో పది లక్షల మంది అమెరికా పౌరులకు ఉపాధి కల్పించడ

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (10:36 IST)
అమెరికా గడ్డపై నివశిస్తున్న పరాయి దేశస్థుల్లో దాదాపు పది లక్షల మందిని తరిమికొడతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. వీరి స్థానంలో పది లక్షల మంది అమెరికా పౌరులకు ఉపాధి కల్పించడమే తన ధ్యేయమని ఆయన చెప్పుకొచ్చారు. 
 
అమెరికా కంపెనీల్లో పని చేస్తున్న విదేశీయులపై ఆయన స్పందిస్తూ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో ఉన్న వారిని పంపించి వేయడం ద్వారా ఆ ఉద్యోగాలన్నింటినీ అమెరికన్లకు ఇప్పిస్తానని, దాంతో నిరుద్యోగ సమస్య అన్న మాట వినపడకుండా పోతుందన్నారు. 
 
గత పాలకుల ఇమిగ్రేషన్ విధానం అత్యంత లోపభూయిష్టమని, అందువల్లే కొత్త పాలసీని తీసుకు వస్తున్నామన్నారు. అత్యున్నత నైపుణ్యతతో ఉండి, నిబంధనలన్నీ పాటించే కొద్దిమందికి మాత్రమే వీసాలను మంజూరు చేస్తామని, అడ్డగోలుగా అమెరికాకు వచ్చి పాతుకు పోయే వారిని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. 
 
బరాక్ ఒబామా హయాంలో దేశంలో ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోయారన్నారు. తాను ఉగ్రవాదాన్ని అణడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మధ్య తరగతి ప్రజలకు పన్ను రాయితీలు ఇవ్వనున్నామని, పౌరులందరికీ ఉపయోగపడేలా కొత్త ఆరోగ్య విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments