'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

ఠాగూర్
సోమవారం, 28 జులై 2025 (15:39 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదులను ఏరివేసే పనిలో భారత బలగాలు నిమగ్నమైవున్నాయి. ఇందుకోసం 'ఆపరేషన్ మహదేవ్‌'ను చేపట్టి.. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న పలువురు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేసింది. 
 
పహల్గాం‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన వచ్చిన పక్కా సమాచారంతో దాచిగామ్‌లో భద్రతా బలగాలు సోదాలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు సమాచారం. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. పహల్గాం ఉగ్రవాదులను తుదముట్టించే లక్ష్యంతో ఆపరేషన్ మహదేవ్ చేపట్టినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలతో పాటు జమ్మూకాశ్మీర్ పోలీసులు పాల్గొన్నారు. 
 
ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్టు సమాచారం. ఈ ముగ్గురు ఉగ్రవాదులూ పహల్గాంలో దాడికి పాల్పడినవారేనని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంపై భద్రతా బలగాల నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సివ ఉంది. ఒకవైపు పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ జరుగుతుండగా మరోవైపు పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ చేయడం గమనార్హం. అది కూడా పహల్గాం ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా ఆపరేషన్ చేపట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments