Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ,సికింద్రాబాద్‌ లలో ప్రారంభమైన రైళ్లు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:47 IST)
దాదాపు రెండున్నర నెలల తర్వాత విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో మళ్లీ కళకళలాడుతున్నాయి. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌లకు చేరుకుంటున్నారు.

రైలు బయలుదేరే సమయానికి 90 నుంచి 120 నిమిషాల ముందే స్టేషన్‌కు చేరుకోవాలన్న నిబంధన మేరకు ముందే తరలివస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న ప్రయాణికులతో క్యూ రోడ్డుపైకి వచ్చేసింది. స్టేషన్‌లలో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేశారు.

స్టేషన్‌లకు చేరుకున్న ప్రయాణికులకు పరీక్షల అనంతరం ఎటువంటి లక్షణాలు లేకుంటేనే లోపలికి పంపిస్తారు. కాగా, ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లు కూడా జారీ చేయనున్నారు.

సికింద్రాబాద్, హైదరాబాద్‌ స్టేషన్లలోని ఫుడ్‌కోర్టులు, ఇతర దుకాణాలు తెరుచుకున్నప్పటికీ పార్శిళ్లు మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments