Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (22:28 IST)
తాను ప్రేమించి వ్యక్తి మరో యువతిని పెళ్లి చేసుకోవడాన్ని ఆ ప్రియురాలు జీర్ణించుకోలేకపోయింది. అంతే తన ప్రేమికుడుకి సమస్యలు సృష్టించాలన్న అక్కసుతో బాంబు బెదిరింపులకు దిగింది. ఇది చెన్నైలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రెనే జోషిల్డా అనే మహిళ చెన్నైలోని ఓ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలు సీనియర్ కన్సల్టెంట్‌గా పని చేస్తుంది. ఓ వ్యక్తిని ఆమె వన్‌సైడ్‌ లవ్ చేసింది. అతడినే వివాహం చేసుకోవాలని భావించింది. అయితే, ఆ వ్యక్తి మాత్రం ఇంట్లో కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు. దీన్ని ఆమె జీర్ణించుకోలేక పోయింది. అతడి ప్రతిష్టను దిగజార్చాలనుకుంది. 
 
ఇందుకోసం తన టెక్నాలజీ తెలివితేటలను ప్రదర్శించింది. ఈ క్రమంలో నకిలీ ఈమెయిల్ ఐడీలు, డార్క్ వెబ్, వీపీఎస్‌ల ద్వారా గుజరాత్, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, తమిళనాడు తదితర  12 రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బాంబు బెదిరింపు సందేశాలను పంపించింది. 
 
అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం, బీజే వైద్య కాలేజీ, రెండు పాఠశాలలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఓ పాఠశాల యాజమాన్యం ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సైబర్ వింగ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ సమన్వయం చేసుకున్నారు. తన గుర్తింపు, లొకేషన్ బయటపడకుండా ఆమె తెలివిగా వ్యవహరించింది. కానీ, చిన్న తప్పిదంతో దొరికిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments