Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో కరోనా విలయం : ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్

Webdunia
గురువారం, 6 మే 2021 (08:42 IST)
దేశంలోని అందమైన సముద్రతీర పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన గోవాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి కరోనా వైరస్ సోకివుంది. ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 51 శాతానికి పెరిగింది. 
 
దేశంలో కరోనా వైరస్ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో గోవా ఒకటి. ఈ రాష్ట్రంలో వైరస్ విజృంభణ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఇక్కడ పరీక్షలు నిర్వహించిన ప్రతి ఇద్దరిలో ఒకరు పాజిటివ్‌గా తేలడం ఆందోళనకు గురిచేస్తోంది. 
 
గత నెలతో పోలిస్తే ఇక్కడ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఏప్రిల్‌లో ఇక్కడ కరోనా పాజిటివిటీ రేటు 40 శాతంగా ఉండగా, ఇప్పుడిది 51 శాతంగా ఉంది. మున్ముందు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఇదిలావుండగా, పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తర్వాత హర్యానా రెండోస్థానంలో ఉంది. ఇక్కడ పాజిటివిటీ రేటు 37 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 
 
గోవాలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్‌కు అడ్డుకట్ట వేయాలంటే పూర్తిస్థాయి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పర్యాటకాన్ని కూడా కొంతకాలం మూసివేయడం మేలని అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments