Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు.. మహిళా ఎమ్మెల్సీ చేయి పట్టుకుని టీపీ రమేష్ ఏం చేశారంటే? (Video)

స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతున్న వేళ ఓ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అయిన మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. సభా వేదికపైనే ఆమె చేయిపట్టుకున్నాడు. కాసేపు ఆమెను చేతిని తన చేతితో అలానే నులిమారు. ఈ ఘటన క

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (16:22 IST)
స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతున్న వేళ ఓ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అయిన మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. సభా వేదికపైనే ఆమె చేయిపట్టుకున్నాడు. కాసేపు ఆమెను చేతిని తన చేతితో అలానే నులిమారు. ఈ ఘటన క‌ర్ణాట‌క‌లోని కొడ‌గు జిల్లాలో మాదికేరి ప‌ట్ట‌ణంలో జ‌రిగిన వేడుక‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ నేత టీపీ రమేష్.. ఎమ్మెల్సీ వీణా అచ్చ‌య్య‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తూ కెమెరాకు చిక్కాడు. మాదికేరి పట్టణంలో జరిగిన ఈ వేడుకలో వీణా చేతిని పట్టుకున్న రమేష్ కాసేపు స్పృశించాడు. ఇంతలో అప్రమత్తమైన వీణా.. అతని చేయి నుంచి తన చేతిని విడిపించుకుంది. ఇదంతా వీడియోలో స్ప‌ష్టంగా రికార్డ‌వ‌డంతో టీపీ ర‌మేశ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
దీనిపై వీణా స్పందిస్తూ.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి సంఘటన తొలిసారి ఎదుర్కొన్నానని చెప్పారు. వేదికపైనే చాలా బరువు తగ్గావ్ అంటూ తన చేయి పట్టుకోవడంతో షాకయ్యానని.. వెంటనే చేయి వెనక్కి లాక్కున్నానని తెలిపారు. త‌ర్వాత ఆయనేమీ తనతో మాట్లాడలేదు. ఇంటికి వెళ్లి ఫోన్ చేసి క్ష‌మించాల‌ని, త‌న‌కు తాను చెల్లితో స‌మాన‌మని చెప్పారు. 
 
ఈ విష‌యం గురించి త్వ‌ర‌లో అధిష్ఠానంతో మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. టీపీ రమేష్ మాత్రం వీణా తనకు చెల్లెలు లాంటిదన్నారు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించలేదన్నారు. ఆమె కోరుకున్న పక్షంలో క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని ప్రకటించారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments