Webdunia - Bharat's app for daily news and videos

Install App

దినకరన్ పనైపోయింది.. ఒక్కో ఎమ్మెల్యేగా జంప్.. ఎందుకు..?

శశికళ మేనల్లుడు టి.టి.వి.దినకరన్ పనైపోయింది. దినకరన్ వెంట ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. మూడురోజుల క్రితం మధురైలో జరిగిన ఒక సమావేశంలో తన వెంట అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు మరింతమంది ఉన్నారని, వారందరూ కూడా వచ్చేస్తా

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (16:13 IST)
శశికళ మేనల్లుడు టి.టి.వి.దినకరన్ పనైపోయింది. దినకరన్ వెంట ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. మూడురోజుల క్రితం మధురైలో జరిగిన ఒక సమావేశంలో తన వెంట అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు మరింతమంది ఉన్నారని, వారందరూ కూడా వచ్చేస్తారని దినకరన్ ధీమాతో చెప్పారు. అయితే అది ప్రస్తుతం కనిపించడం లేదు. కారణం పన్నీరుసెల్వం, పళణిస్వామిలు కలిసిపోతుండటంతో దినకరన్ పప్పులు ఉడికేటట్లు కనిపించడం లేదు.
 
పన్నీరుసెల్వం డిమాండ్లకు తలొగ్గి పళణిస్వామి అన్నింటికీ ఒకే చెప్పడంతో పాటు వాటిని అమలు కూడా చేస్తుండటంతో దినకరన్‌కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఎలాగైనా ఆర్.కే నగర్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిపోదామనుకున్న దినకరన్‌కు ఎన్నికల కమిషన్ రూపంలో అడ్డు తగిలింది. జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తరువాతైనా ఎలాగోలా పార్టీని తనవైపు తిప్పుకుందామని ప్రయత్నం చేశాడు.
 
అయితే పళణిస్వామి మాత్రం తన ముఖ్యమంత్రి పదవికి ఎవరూ ఎసరు పెట్టకూడదని తన శత్రువైన పన్నీరుసెల్వంతోనే కలవడానికి సిద్ధమయ్యాడు. దీంతో దినకరన్‌కు లేవలేని దెబ్బ తగిలినట్టయింది. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలవడంతో దినకరన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలందరూ పళణిస్వామి దగ్గరకే వెళ్ళేందుకు సిద్ధమైపోయారట. ఒక్కొక్కరు జంప్ అవ్వడానికి సిద్థంగా ఉన్నారట. మరి దినకరన్ జంప్ అవ్వనున్న ఎమ్మెల్యేలను ఎలా పట్టుకుని మిగిలిన ఎమ్మెల్యేలు ఎలా తనవైపు తిప్పుకుంటారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments