తమిళనాడులో 10 వరకు స్కూల్స్ బంద్ - ఆన్‌లైన్‌ క్లాసులకు ఆదేశం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (16:22 IST)
కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఈ నెల 10వ తేదీ వరకు ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌ను మూసివేసింది. అయితే, 9 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తెరిచినప్పటికీ తల్లిదండ్రుల అనుమతి లేఖతో వెళ్లిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇవి ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు అమల్లో ఉంటాయి. 
 
ఇదిలావుంటే, కేంద్రం ఆదేశం మేరకు సోమవారం నుంచి చిన్నారులకు కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. స్థానిక సైదాపేటలోని మాందోపు హైస్కూల్‌లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లోనే టీకాలు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments