Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ఘోరం: ఓటీపీ చెప్పలేదని ప్రయాణీకుడిని చంపేశాడు..

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (20:02 IST)
చెన్నైలో ఘోరం జరిగింది.  ఓటీపీ చెప్పలేదని ఓలా క్యాబ్ డ్రైవర్ ప్రయాణీకుడిని కొట్టి చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై శివారులోని గూడువాంజేరి సమీపంలోని కన్నివాక్కం కుందన్‌నగర్‌లో ఉంటున్న ఉమేందర్ (33) కోయంబత్తూర్‌లో ఐటీ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. 
 
ప్రతి శనివారం చెన్నై వచ్చి కుటుంబంతో గడుపుతుంటాడు. అయితే ఆదివారం ఉమేందర్ భార్య భవ్య, వారి పిల్లలు, భవ్య సోదరి, వారి పిల్లలు కలిసి నవలూర్‌లోని మాల్‌కు వెళ్లాడు. 
 
ఇందుకోసం వారు ఓలాలో ఓ క్యాబ్ బుక్ చేశారు. వారిని పికప్ చేసుకునేందుకు క్యాబ్ డ్రైవర్ రవి అక్కడికి చేరుకున్నారు. అయితే ఓటీపీ చెప్పకుండా వారు కారులో ఎక్కేసరికి, రవికి ఆగ్రహం వచ్చింది. ముందు ఓటీపీ చెప్పి తర్వాత క్యాబ్ ఎక్కాలని వారిని దించేశాడు. 
 
అంతేకాకుండా ఏడుగురు ఉన్నందున ఉమేందర్ కారు బదులు ఎస్‌యూవీ బుక్ చేసి ఉండాల్సిందని రవి చెప్పాడు. దీంతో రవి, ఉమేందర్ మధ్య మాటామాటా పెరిగింది.
 
ఆ తర్వాత ఉన్నట్టుండి ఉమేందర్ తలపై రవి.. తన ఫోన్‌తో గట్టిగా కొట్టాడు. అనంతరం ఉమేందర్‌పై పిడి గుద్దులు కురిపించాడు. దీంతో ఉమేందర్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే ఉమేందర్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
 
మరోవైపు తప్పించుకుని పారిపోబోయిన రవిని.. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన కేలంబాక్కం పోలీసులు రవిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments