Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఆర్టీసీ టిక్కెట్‌తోపాటు శ్రీవారి దర్శన టిక్కెట్

Advertiesment
venkateswara swamy
, శుక్రవారం, 1 జులై 2022 (11:45 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులకు ఆ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ శుభవార్త చెప్పింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు ఈ తీపి కబురుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వెళ్లేందుకు ఆర్టీసీ బస్‌ టికెట్‌తో పాటు వెంకటేశ్వరస్వామి దర్శనానికి టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్ని జూలై ఒకటో తేదీ శుక్రవారం నుంచి వినియోగించుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. 
 
ప్రతిరోజూ వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, తితిదే మధ్య అంగీకారం కుదిరిందని వెల్లడించారు. తిరుమలకు బస్‌ టికెట్‌ రిజర్వు చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్లు బుక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 
 
అదేవిధంగా ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా కూడా ఈ టిక్కెట్లను రిజర్వు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌ లేదా టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లలో ప్యాకేజీ కోసం కనీసం వారం ముందుగా టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై నెలలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవు!