Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (09:26 IST)
ఆ భర్త అన్నంతపనీ చేశాడు.. అవకాశం చిక్కితే నీ ముక్కును కొరుక్కుని తినేస్తానే అంటూ పదేపదే భార్యతో అంటుండేవాడు. ఇపుడు ఆ పనీ చేసేశాడు. భార్య ముక్కు అందంగా ఉండటాన్ని భర్త జీర్ణించుకోలేకపోయాడు. ముక్కును ముద్దాడుతూనే చటుక్కున కొరికేశాడు. ఈ దారుణ వెస్ట్ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జరిగింది. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధలోని బైర్బారా ప్రాంతంలో భర్త బాపన్ షేక్‌తో కలిసి మధు ఖాతూన్ అనే మహిళ ఉంటోంది. 
 
ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా అలజడి ేగింది. మధు ఖాతూన్ అరుపులు, కేకలు మార్మోగాయి. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి శాంతిపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవకాశం దొరికితే ముక్కును కొరికి తినేస్తానని నా భర్త అపుడపుడూ అంటుండేవాడనీ, ఇపుడు అన్నంతపని చేశాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments