Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్.. డాక్టర్ ఇల్లు ఖాళీ చేయకపోతే.. అత్యాచారం చేస్తానన్నాడు..

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (16:27 IST)
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తాకిడి ఒడిశా చాలా దూరంలో వుంది. ఈ రాష్ట్రంలో కేవలం మూడు కేసులే న‌మోదు అయినా.. ప్రజల్లో భయం మాత్రం ఎక్కువగానే ఉంది. తాజాగా ఓ మహిళా డాక్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌లో పనిచేస్తున్న ఓ యువ మహిళా డాక్టర్.. ఓ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్‌లో ఉంటోంది. 
 
కానీ ఒడిశాలో క‌రోనా కేసులు స్టాట్ అవ్వ‌డంతో ఆ ఫ్లాట్‌లో వాళ్లంతా స‌ద‌రు డాక్టర్‌ను అదోలా చూడటం మొదలుపెట్టారు. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆమెను ఫ్లాట్ నుంచి ఖాళీ చేయించాలనుకున్నారు. ఆ ఫ్లాట్ ఓవర్ ఇంకా బేరర్ అయిన అతను ఆమెను పంపిచేస్తానని హామీ ఇచ్చాడు.  
 
ఈ క్ర‌మంలోనే స‌ద‌రు బేర‌ర్‌, అత‌ని భార్య కలిసి.. ఆమెను ఖాళీ చెయ్యమని పదే పదే చెప్పారు. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్న ఆమె ఖాళీ చెయ్యకపోవడంతో... బేర‌ర్‌ ఆమె ఫ్లాట్‌కి వెళ్లి.. ఒంటరిగా వున్నావ్.. తనకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ.. దొరికిపోతావ్.. అత్యాచారం చేస్తానని బెదిరించాడు. దీంతో వైద్యురాలికి చిర్రెత్తుకొచ్చింది.
 
ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు క్రిమినల్ కేసు నమోదుచేశారు. మ‌రోవైపు సొసైటీ మొత్తం ఆ డాక్టర్‌పై కేసు పెట్టింది. ఆమె ఆఫీస్ బేరర్‌తో అమర్యాదగా ప్రవర్తించిందని కంప్లైంట్‌లో తెలిపారు. ఇక‌ పోలీసులు ప్ర‌స్తుతం రెండు కేసుల్నీ దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments