Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరమాండల్ ఎక్స్‌‍ప్రెస్ రైలు ప్రమాద మృతుల సంఖ్య 275 : ఒడిశా సర్కారు క్లారిటీ

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (16:56 IST)
ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 275 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఒడిశా ప్రభుత్వం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఇంతకుముందు 288 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పిన అధికారులు.. మృతదేహాల లెక్కింపులో పొరపాట్లు జరిగాయన ఇప్పటివరకు 275 మంది చిపోయారని అధికారులు పేర్కొన్నారు. 
 
'కొన్ని మృతదేహలను రెండు సార్లు లెక్కించారు. సంఘటన స్థలంలో లెక్కించి, ఆ తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మరోసారి లెక్కపెట్టారు. దీంతో మృతుల సంఖ్యలో తేడా వచ్చింది. చివరిసారి లెక్కించినప్పుడు స్పష్టత వచ్చింది' అని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ జెనా వెల్లడించారు.
 
మొత్తం 275 మంది మృతుల్లో ఇప్పటివరకు 78 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. మరో 10 మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మిగతా 187 వాటిల్లో 170 మృతదేహాలను భువనేశ్వర్‌కు, 17 మృతదేహాలను బాలేశ్వర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు. 
 
మొత్తం 85 అంబులెన్స్‌ల ద్వారా మృతులను భువనేశ్వర్‌లోని వివిధ మార్చురీలకు తరలించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా, మృతులు, క్షతగాత్రుల ఫొటోలను https://srcodisha.nic.in/, https://www.bmc.gov.in, https://www.osdma.org. వెబ్‌సైట్లలో పొందుపరిచామని, ఎవరైనా గుర్తిస్తే.. 18003450061 లేదా 1929 నెంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: కుంటుతూ.. గెంతుకుంటూ చావా ట్రైలర్ ఈవెంట్‌కు రష్మిక మందన్న.. అవసరమా? (video)

నాగ్‌పూర్ పోలీసుల కోసం ఫతే ప్రత్యేక స్క్రీనింగ్‌కు హాజరైన సోనూ సూద్

తెలుగులో రాబోతున్న విశాల్ చిత్రం మదగజ రాజా

Monalisa: రామ్ చరణ్ మూవీలో వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

తర్వాతి కథనం
Show comments