Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒడిశాలో షాకింగ్ ఘటన.. పురీష నాళంలో గాజు గ్లాసు.. పది రోజుల తర్వాత?

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (22:28 IST)
Odisa man
ఒడిశాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కడుపు నొప్పిగా వుందని ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తిని పరిశోధించిన వైద్యులకు షాక్ ఇచ్చే ఘటన చోటుచేసుకుంది. అతనికి తీసిన ఎక్స్ రేలో పురీష నాళం (సిగ్మాయిడ్ కోలన్) లోపల గుండ్రంగా గ్లాస్ ఉండటాన్ని గమనించారు. దీనిని వైద్యులు పోరాడి వెలికి తీశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన కృష్ణ చంద్ర రౌత్ అనే వ్యక్తి (45) జీవనోపాధికోసం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. అయితే.. పార్టీ మధ్యలో స్నేహితులు పైశాచికంగా ప్రవర్తించారు. రౌత్ ప్రైవేటు పార్ట్‌లో స్టీల్ గ్లాసును చొప్పించి, పైశాచికానందం పొందారు. 8 సెంటీమీటర్ల వ్యాసం, 15 సెంటీమీటర్ల పొడవున్న గాజును 10 రోజుల క్రితం మద్యం మత్తులో స్నేహితులు కృష్ణ చంద్ర రౌత్ మలద్వారంలో చొప్పించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి రౌత్ ఆరోగ్యం విషమించింది. 
 
దీంతో అతడిని చూసిన కుటుంబ సభ్యులు, స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఎక్స్ రే తీశారు. దానిలో పురీష నాళంలో ఒక గ్లాసు ఉండటాన్ని గమనించారు.
 
దీనికి ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. చివరికి కొలోస్టోమీ ద్వారా పొత్తికడుపు కోత అనే లాపరోటమీని నిర్వహించి గ్లాసును వెలికి తీశారు. గాజును తొలగించడానికి దాదాపు 2.5 గంటలు పట్టింది. రోగి పరిస్థితి బాగానే ఉందని, మరో నాలుగైదు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంటారని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments