పార్శిల్‌లో పాము... ఓపెన్ చేయగానే బుసకొట్టిన కింగ్ కోబ్రా

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (14:30 IST)
ఒడిషాకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి వచ్చిన ఓ పార్శెల్‌ను విప్పి చూస్తుండగా అందులోనుంచి ఓ పాము ప్రత్యక్షమైంది. ఈ పామును చూడగానే ఆయన భయాందోళనకు గురయ్యాడు. పార్శిల్ విప్పగానే పాము బుసకొడుతూ పడగ విప్పింది. ఈ షాకింగ్‌ నుంచి ఆయన తేరుకునేందుకు కొంత సమయం పట్టింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ అనే వ్యక్తి ఇటీవల తన మకాంను ఒడిషాకు మార్చాడు. దీంతో ఒడిషాలోని మయూర్ భంజ్‌లోని రైరంగాపూర్ ఏరియాలో ఓ ఇంటిలో ఉంటున్నాడు. 
 
ఈయన విజయవాడ ఇంటి నుంచి కొన్ని సామానులను పార్శిల్‌లో ఒడిషాకు కొరియర్‌లో తరలించాడు. ఈ కొరియర్‌ నుంచి వచ్చిన పార్సిల్‌ను విప్పుతుండగా అందులోంచి పాము బయటికి రావడంతో విస్తుపోయారు. పార్సిల్‌లో పాము బయటపడిన విషయాన్ని ముత్తుకుమరన్‌ అటవీ అధికారులకు తెలుపగా వారు అక్కడికి చేరుకుని పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. 
 
15 రోజుల క్రితం తాను ప్రైవేట్‌ కొరియర్‌ ఏజెన్సీ నుంచి పార్సిల్‌ను బుక్‌ చేశానని ముత్తుకుమరన్‌ తెలిపారు. ఈనెల 9న గుంటూరు నుంచి ఈ పార్సిల్‌ తనకు పంపారని చెప్పారు. గృహోపకరణాలతో కూడిన ఈ పార్సిల్‌ను విప్పిచూస్తుండగా అందులో​ పాము కనిపించడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఒడిషాకు పార్సిల్‌ను తరలించే క్రమంలో పాము ఇందులోకి చేరిఉంటుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments