Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్..

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (12:30 IST)
కులాంతర వివాహాలు చేసుకునే వారికి గుడ్ న్యూస్. కులాంతర వివాహాలను ప్రోత్సహించే దిశగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. కులాంతర వివాహాలు చేసుకునేవారు సర్కారు ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమంగళ్ పేరిట ఓ వెబ్‌సైట్‌ను ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సుమంగళ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. 
 
కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఇచ్చే ప్రోత్సాహకం లక్ష రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలకు పెంచామని సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. గతంలో రూ.50వేలున్న అంతర్ కుల వివాహ ప్రోత్సాహకాన్ని 2017లో లక్షరూపాయలకు పెంచింది. ప్రస్థుతం దీన్ని రెండున్నర లక్షల రూపాయలకు పెంచింది. కులాంతర వివాహాలు సామాజిక సామరస్యానికి దోహదపడతాయని సీఎం చెప్పారు.
 
ఉన్నత కులానికి చెందిన వారు షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిని హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకుంటే వన్ టైమ్ ప్రోత్సాహకం అందిస్తామని సర్కారు వెల్లడించింది. మొదటిసారి వివాహం చేసుకున్న వారికి మాత్రమే ఈ గ్రాంట్ ఇస్తామని, అయితే వధువు వితంతువు అయితే వారు ప్రోత్సాహకానికి అర్హులని సర్కారు పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం