Webdunia - Bharat's app for daily news and videos

Install App

విందు భోజనంలో మటన్ కర్రీ వడ్డించలేదనీ పెళ్లి రద్దు ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (10:55 IST)
సాధారణంగా వరకట్నాల కారణంగా పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. కానీ ఈ పెళ్లి మాత్రం విందులో మటన వడ్డించలేదన్న కారణంగా ఆగిపోయింది. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మనతిరా గ్రామానికి చెందిన ఓ యువకుడి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. 
 
కానీ, మటన్‌ కారణంగా పెళ్లిని రద్దు చేసుకునేంత వరకు వెళ్లింది. పెళ్లి విందులో మటన్‌ కర్రీ వడ్డించలేదని ఏకంగా వివాహాన్నే రద్దు చేసుకున్నాడు ఓ యువకుడు. అంతేనా, ఆ మరుసటి రోజే వేరే యువతిని కూడా పెళ్లాడాడు. 
 
పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి తోడు పెళ్లి కొడుకు, ఇతర బంధువులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లిలో మటన్‌ కర్రీ కావాలని తోడు పెళ్లి కొడుకు అడిగాడు. అయితే ఆ విందులో మేక మాంసం లేదు. ఆ విషయం చెప్పగానే వరుడి తరపు వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. 
 
ఈ వివాదం చివరికి పెద్దగా మారింది. చివరకు పెళ్లి కొడుకు పెళ్లిని రద్దు చేసుకుని తన వారితో కలిసి బయటకు వచ్చేశాడు. వరుడు అతని బంధువులు జిల్లాలోని కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. 
 
ఆ మరుసటి రోజే తమ్కా పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై వధువు బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments