15 మంది విద్యార్థినిలపై ఏడుగురు ఉపాధ్యాయులు లైంగిక దాడి చేశారు.. ఎక్కడ?
విద్యాబుద్ధుల చెప్పాల్సిన ఉపాధ్యాయులు కామంతో కళ్లు మూసుకుని పోవడంతో కామాంధులుగా మారిపోయారు. ఫలితంగా 15 మంది విద్యార్థినిలుపై ఏడుగురు టీచర్లు లైంగిక దాడికి తెగబడ్డారు.
విద్యాబుద్ధుల చెప్పాల్సిన ఉపాధ్యాయులు కామంతో కళ్లు మూసుకుని పోవడంతో కామాంధులుగా మారిపోయారు. ఫలితంగా 15 మంది విద్యార్థినిలుపై ఏడుగురు టీచర్లు లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ దారుణం ఒడిషా రాష్ట్రంలోని కోరాపూట్ జిల్లా, దామన్జోడిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కోరాపూట్ జిల్లాలోని దామన్జోడీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజాశ్రీ దాస్ ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఏడో తరగతి, తొమ్మిదో తరగతి విద్యార్థులు విచారణలో తెలిపిన వివరాల ప్రకారం... తమపై క్లాస్ రూముల్లో, లైబ్రరీలో, పాఠశాల ఆవరణలో తమ పట్ల ఏడుగురు టీచర్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. నిందితులైన ఏడుగురు ఉపాధ్యాయులను వారు గుర్తించారు. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.