తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. ఓ వివాహిత పట్ల కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త.. భార్యను కాటికి పంపాడు. ఇంతకీ అతను ఏం చేస్తారో తెలుసా? ఓ న్యాయవాదవృత్తిల
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. ఓ వివాహిత పట్ల కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త.. భార్యను కాటికి పంపాడు. ఇంతకీ అతను ఏం చేస్తారో తెలుసా? ఓ న్యాయవాదవృత్తిలో రాణిస్తున్నాడు.
ఈయన భార్యను భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన రాజమండ్రిలోని జాంపేట్‌లో చోటు చేసుకుంది. తన భార్య సుధారాణి ఉరి వేసుకుని చనిపోయిందని, భర్త న్యాయవాది అయిన ప్రభాకర్ పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న సుధారాణి తల్లిదండ్రులు తమ అల్లుడే హంతకుడని ఆరోపించారు. తమ కుమార్తెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నాడని అన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.