Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక రిలయన్స్ జియో పెట్రోల్‌ బంకులు!

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (06:20 IST)
రిలయన్స్ జియో.. మొబైల్ వినియోగించే ప్రతి ఒక్కరికి ఈ పేరు దాదాపుగా తెలిసిందే. అయితే ఇప్పడు ఈ రిలయన్స్ జియో.. మరో అడుగు ముందుకేస్తోంది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL).. తన ఇంధన రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ (బీపీ)తో ఫైనల్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్న తరువాత.. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీసీ తాజాగా ఫైనల్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశాయని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

జియో-బీపీ బ్రాండ్‌ ఆయిల్ మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్‌ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్‌ మరింత దూసుకెళ్తుందని ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. రెగ్యులేటరీ, ఇతర ఆమోదాలకు లోబడి, 2020 ప్రథమార్ధంలో జియో-బీపీ జాయింట్ వెంచర్ ఏర్పడుతుందని భావిస్తున్నారు.

దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) 51 శాతం, బీపీ 49 శాతం వాటా ఉంటుంది. ఇక ఈ వాటా కోసం.. బీపీ ఏడువేల కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి.

అయితే వీటితో కలిపి మొత్తం 5,500 పెట్రోల్‌ బంకులను జాయింట్‌ వెంచర్‌ ద్వారా అందుబాటులోకి తేవాలని టార్గెట్ పెట్టుకుంది. దీని ద్వారా ఇండియన్ కస్టమర్స్‌కు అధిక-నాణ్యత విభిన్న ఇంధనాలు, ఇతర సేవలను అందించనున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments