Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీని చంపింది గాడ్సేనే... అమికస్ క్యూరీ

జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు విచారణను మళ్లీ తిరగదోడాల్సిన పని లేదనీ కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (09:40 IST)
జాతిపిత మహాత్మా గాంధీని చంపింది ముమ్మాటికీ గాడ్సేనే అని.. అందువల్ల 60 యేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు విచారణను మళ్లీ తిరగదోడాల్సిన పని లేదనీ కోర్టు నియమించిన అమికస్ క్యూరీ, సీనియర్ లాయర్ అమరేంద్ర శరణ్ సుప్రీంకోర్టుకు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ అఫిడవిట్ సమర్పించారు. 
 
జాతిపిత హత్య కేసును జస్టిస్ ఎస్‌ఏ బోబ్డె నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. మహాత్మా గాంధీ హత్యలో ఓ విదేశీ సంస్థ హస్తం ఉందని, ఈ కేసును తిరిగి విచారించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఈ ధర్మాసనం ఏర్పాటైంది. దీనికి సంబంధించిన అమికస్ క్యూరీగా అమరేంద్ర శరణ్‌ను సుప్రీంకోర్టు నియమించింది. 
 
కానీ కేసు పునర్విచారణ అవసరం లేదని శరణ్ తన నివేదికలో స్పష్టంచేశారు. విదేశీ సంస్థ హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన వెల్లడించారు. గాంధీ శరీరంలోకి దిగిన బుల్లెట్లు, ఏ పిస్తోలు నుంచి వాటిని ఫైర్ చేశారు.. ఎవరు కాల్చారు.. దాని వెనుక కుట్ర.. ఇలా అన్నింటినీ స్పష్టంగా గుర్తించారు.
 
గాడ్సే కాకుండా మరో అజ్ఞాత వ్యక్తి గాంధీ హత్యలో పాలుపంచుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టంచేసింది. గాంధీ శరీరంలో దిగిన నాలుగో బుల్లెట్ ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్చిందని, దానివల్లే ఆయన మరణించారన్న పిటిషనర్ వాదనను కూడా శరణ్ తోసిపుచ్చారు. అందువల్ల ఈ కేసు పునర్విచారణ చేయాల్సిన అవసరం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments