Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరదలిపై రేప్... జైల్లో పెట్టించిందనీ కసి తీర్చుకున్నాడు...

హరియాణాలో దారుణం జరిగింది. అత్తను హత్య చేసిన అల్లుడు ఆ తర్వాత కొంత కాలానికి తన మరదలిపై కన్నేశాడు. అదనుచూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బావ తనపై చేసిన అఘాయిత్యాన్ని కోర్టులో నిలబడి అతడికి జైలు శిక

Advertiesment
మరదలిపై రేప్... జైల్లో పెట్టించిందనీ కసి తీర్చుకున్నాడు...
, బుధవారం, 18 అక్టోబరు 2017 (18:08 IST)
హరియాణాలో దారుణం జరిగింది. అత్తను హత్య చేసిన అల్లుడు ఆ తర్వాత కొంత కాలానికి తన మరదలిపై కన్నేశాడు. అదనుచూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బావ తనపై చేసిన అఘాయిత్యాన్ని కోర్టులో నిలబడి అతడికి జైలు శిక్ష పడేట్లు చేసిందామె. ఐతే మంగళవారంనాడు ఆమె హత్యకు గురైంది. తుపాకీతో ఆమెను అత్యంత సమీపం నుంచి కొందరు దుండగలు కాల్చి చంపారు. 
 
వివరాల్లోకి వెళితే... హరియాణాకు చెందిన గాయని హర్షితా దహియాకు 22 ఏళ్లు. ఆమె వీధి నృత్యాలు చేయడమే కాకుండా గాయనిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన అక్క భర్త ఆమెపై అత్యాచారం చేశాడు. దీనితో కేసు పెట్టి అతడిని జైలుకు పంపింది. ఇటీవలే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఆమెకు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. ఈ విషయాన్ని స్వయంగా హర్షితా యూ ట్యూబులో కూడా పోస్ట్ చేసింది. తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయింది. 
 
అదలావుండగానే మంగళవారం నాడు ఆమె పానిపట్ జిల్లాలో చమ్రారాలో ప్రదర్శన ఇచ్చి కారులో వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను అడ్డగించారు. పట్టపగలే ఆమెను చుట్టుముట్టి తుపాకులతో కాల్చి చంపి పరారయ్యారు. ఐతే ఈ హత్య చేసింది తన భర్తేనని హర్షిత అక్క లత వెల్లడించింది. తన తల్లి హత్యలో తన చెల్లి ప్రత్యక్ష సాక్షి అనీ, అందువల్ల ఆ కేసులో తనకు శిక్ష పడుతుందని భయపడి తన చెల్లిని పొట్టనబెట్టుకున్నాడని వెల్లడించింది. దీనితో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా టాప్ కింద చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు... ఎయిర్ హోస్టెస్