Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే... ఒట్టిదే..! స్వర్ణం పన్నుపై కేంద్రం వివరణ

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (08:15 IST)
పరిమితికి మించి బంగారం కలిగి ఉన్నవారిపై పన్ను, జరిమానా విధించే దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. ‘బంగారం క్షమాభిక్ష’ స్కీం అసలు పరిశీలనలోనే లేదని తేల్చిచెప్పింది.

తమ వద్ద ఎంత బంగారం ఉందో చెప్పాలని మోదీ ప్రభుత్వం స్పష్టం చేయనుందని పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. పరిమితికి మించి ఉన్న బంగారంపై పన్ను విధించి.. ‘ఆమ్నెస్టీ’ (సార్వత్రిక క్షమాభిక్ష) కింద శిక్షించకుండా వదిలేస్తుందని.. తర్వాత కొరడా ఝళిపిస్తుందని.. లెక్కల్లో చూపించని బంగారంపై భారీ స్థాయిలో జరిమానాలు విధిస్తుందని.. ప్రాసిక్యూట్‌ కూడా చేయొచ్చని.. కొత్తగా కొన్న బంగారు కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటుందని.

రశీదు లేకుండా బంగారం కొంటే భారీ జరిమానాలు తప్పవని సదరు కథనాల్లో పేర్కొన్నాయి. ఆదాయ పన్ను (ఐటీ) విభాగం ఈ స్కీమును గతంలోనే తిరస్కరించిందని.. తాజాగా నీతి ఆయోగ్‌, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం దీనిని ప్రవేశపెట్టాలని గట్టిగా ప్రతిపాదిస్తున్నాయని వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. బడ్జెట్‌ ప్రక్రియ నడుస్తున్నప్పుడు ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని వ్యాఖ్యానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీమ్ మెంబరుతో రెహ్మాన్‌ రిలేషన్‌లో ఉన్నారా?

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments