ఈ నెలాఖరు వరకు ఎయిర్‌ ఇండియా సేవలుండవ్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (16:13 IST)
ఎయిర్‌ ఇండియా సంస్థ ఈ నెల 30వ తేదీ వరకు తమ సర్వీసులను తిరిగి ప్రారంభించబోమని స్పష్టం చేసింది. దేశీయ, విదేశీ మార్గాల్లో ఈ నెల 30 వరకు విమానాలు నడుపబోమని చెప్పింది.

మిగతా సంస్థలు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఆంక్షలు సడలిస్తారని, ఇందులో తమ సర్వీసులు కూడా ఉంటాయని భావిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత నెల 24 నుంచి విమాన సర్వీసులు నిలిపోయాయి.

వాటిని యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విమానయాన మంత్ర హర్దీప్‌ సింగ్‌పూరి రెండు రోజుల క్రితం ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా అత్యవససర సేవలు మినహా దేశంలో అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి.

రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. గూడ్స్‌, నిత్యావసర సరుకులు, వైద్య సేవల కోసం మాత్రమే కొన్ని విమానాలు, రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 14 వ తేదీతో లాక్‌డౌన్‌ పూర్తి కావడం, దాన్ని పొడిగించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల సమాచారంతో దేశీయ విమాన సర్వీసులు మళ్లీ మొదలుకానున్నాయి.

ఈ నెల 15 వ తేదీ నుంచి సర్వీసులను పునరుద్ధరించాలని విమాయన సంస్థలు భావిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments