వెయ్యి నోట్ల కథ కంచికేనా..? ప్రస్తుతానికి ఆ నోట్లను ముద్రించే ఆలోచన లేదట..
రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మళ్లీ ముద్రిస్తారని అందరూ అనుకున్నారు. రూ.500 నోట్ల సంగతి పక్కనబెడితే.. రూ.1000 నోట్ల కథ మాత్రం కంచికేనని తెలుస్తోంది. ఇకపై వెయ్యి నోట్లను
రూ.500, రూ.1000 నోట్లు రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ నోట్లను మళ్లీ ముద్రిస్తారని అందరూ అనుకున్నారు. రూ.500 నోట్ల సంగతి పక్కనబెడితే.. రూ.1000 నోట్ల కథ మాత్రం కంచికేనని తెలుస్తోంది. ఇకపై వెయ్యి నోట్లను ప్రజలు చూడకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికైతే వాటిని ముద్రించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.
నోట్ల మార్పిడిలో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు నోట్ల మార్పిడి పరిమితిని రూ.4500 నుంచి రూ.2000కు తగ్గించినట్టు జైట్లీ వెల్లడించారు. పెళ్లిళ్ల కోసం రూ.2.5 లక్షల వరకు డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని జైట్లీ పేర్కొన్నారు. 22,500 ఏటీఎంలను ఇంకా రీక్యాలిబరేట్ చేయాల్సిన పరిస్థితి ఉందని.. అందుకే వెయ్యి నోట్ల ముద్రణను పక్కనబెట్టి.. రూ.500 నోటు తర్వాత ఏకంగా రూ.2వేల నోటును అందుబాటులోకి తెచ్చే పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.