Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మకు విదేశాల్లో వైద్యం వద్దే వద్దు.. పండితులు చెప్పేశారు.. శశికళ నుంచి నో సిగ్నల్..

తమిళనాడు సీఎం జయలలిత గత 28 రోజులుగా చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీన ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరిన జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్‌ వారం రోజులుగా రిలీజ్ కాల

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (14:10 IST)
తమిళనాడు సీఎం జయలలిత గత 28 రోజులుగా చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22వ తేదీన ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరిన జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్‌ వారం రోజులుగా రిలీజ్ కాలేదు. అమ్మకు చికిత్స అందించేందుకు ముందుగా ముంబై నుంచి డాక్టర్లు అపోలోకు వచ్చారు. ఆపై లండన్ నుంచి రిచర్డ్ తన వైద్య బృందంతో చెన్నైకి వచ్చారు. వీరికి తర్వాత ఎయిమ్స్ వైద్యులను కేంద్రం చెన్నైకి పంపింది.
 
ప్రస్తుతం సింగపూర్ నుంచి ఫిజియోథెరపీ నిపుణులు చెన్నై అపోలోకి వచ్చారు. ఇలా విదేశీ వైద్యుల రాకతో అమ్మ కోలుకుందని.. నోరు విప్పి మాట్లాడుతున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అమ్మను సింగపూర్‌కు ప్రత్యేక ఆంబులెన్స్ విమానంలో తీసుకెళ్ళి చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 
 
చెన్నైకి వచ్చిన సింగపూర్ వైద్యులు కూడా ఆమెకు మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. కానీ విదేశాలకు వెళ్ళి చికిత్స పొందడం అమ్మకు ఇష్టం లేదట. ప్రస్తుతానికి విదేశాలకు వెళ్ళి చికిత్స పొందడం మంచిది కాదని ఆస్థాన జ్యోతిష్యులు చెప్పడంతో శశికళ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదని సమాచారం. దీంతో కేంద్ర ప్రభుత్వ సూచనను నిరాకరించినట్లు తెలుస్తోంది.  
 
ఇదిలా ఉంటే.. అమ్మ లేకుండా ఆమె శాఖలకు బాధ్యతలు వస్తున్న ఆర్థిక మంత్రి ఓ పన్నీర్ సెల్వం.. కేబినెట్ సమావేశం నిర్వహించారు. అక్టోబర్ పదో తేదీకి తర్వాత అపోలో నుంచి ఎలాంటి హెల్త్ బులిటెన్ రిలీజ్ కాలేదు. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు అమ్మ కోసం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అమ్మ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. 8 రోజులైనా అమ్మ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments