Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషుల్లో మాయమైన మానవత్వం, చనిపోతుంటే ఫోటోలు తీశారు

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (18:51 IST)
టెక్నాలజీ మాయలో పడి సాటి మనిషికి సహాయ పడాలన్నా విషయాన్నీ మరుస్తున్నారన్న దానికి ఈ ఫోటేనే ఉదాహరణ. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతన్ని అతి కష్టం మీద చికిత్సం కోసం తీసుకెళుతున్నారు.

అయితే ఆ వ్యక్తిని ఫోటోలైతే తీస్తున్నారు కానీ అతనికి సహాయం చేయలేదు. ఈ అమానవీయ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.

తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సుబ్రమణి తన భార్య సోదరి కుటుంబాన్ని కలిసేందుకు పుదుచ్చేరిలోని సుతుకేనికి వచ్చాడు. క్షయ వ్యాధితో బాధపడుతున్న అతడి ఆరోగ్యం బుధవారానికి పూర్తిగా క్షీణించింది. దాంతో ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు ఉపక్రమించారు కుటుంబసభ్యులు.
 
అయితే కూలి చేసుకొని బ్రతికే సుబ్రమణి బంధువుల వద్ద కనీసం మొబైల్‌ ఫోన్‌ కూడా లేదు.. దాంతో అంబులెన్సుకు ఫోన్‌ చేయలేకపోయారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న తోపుడు బండిలో అతడిని తీసుకుని భార్యభర్తలిద్దరూ సుబ్రమణిని ఆస్పత్రికి తీసుకెళుతున్నారు.

ఇక్కడ అవమానం ఏమిటంటే వారి బాధలు చూసిన బాటసారులు ఫొటోలు, వీడియోలు తీశారు గానీ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. కనీసం అంబులెన్సుకు ఫోన్ చెయ్యాలన్న ఆలోచన కూడా చేయలేదు.

సరైన సమయంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కనీసం ఒకగంట ముందు ఆసుపత్రికి తీసుకువెళ్లినా అతను బ్రతికేవాడని బంధువులు వాపోయారు.
 
ఇదిలావుంటే మరణించిన సుబ్రమణిని ఇంటికి తీసుకెళ్లే విషయంలో కూడా వారికి చేదు అనుభవం ఎదురైంది. పుదుచ్చేరి సరిహద్దులో ఉన్న ఆసుపత్రి నుంచి 25 కిలోమీటర్ల దూరం ఉన్న వారి ఊరికి తీసుకెళ్లేందుకు వాహనాలకు అనుమతి లేకపోవడంతో.. శవంతో ఆస్పత్రి వద్దే ఉండిపోయారు బంధువులు.

విషయం తెలుసుకున్నఓ పోలీస్ అధికారి మురుగనందన్‌ ఆస్పత్రికి వచ్చి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా అంబులెన్సును రప్పించి సుబ్రమణి శవాన్ని సొంతూరికి తరలించారు. అనంతరం మాట్లాడిన మురుగనందన్‌.. అతనికి చావుకు అందరం కారణమని అన్నారు.

సకాలంలో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో మనమంతా సహాయం చెయ్యలేదని అన్నాడు. సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఇలా వదిలేయడం చాలా తప్పు అని అన్నారు. కాగా సుబ్రమణిని అతని సొంత ఊరికి తీసుకువెళ్లి అక్కడే దహనం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments