Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

ఠాగూర్
బుధవారం, 30 జులై 2025 (19:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో ఆగస్టు 1 నుంచి 'నో హెల్మెట్ నో పెట్రోల్' విధానం అమలులోకి రానుంది. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ పంపుకు వస్తే వారికి ఇంధనం నింపేందుకు అనుమతి నిరాకరించనున్నారు. ఎల్లుండి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని జిల్లా అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నియంత్రించేందుకు ఇండోర్ జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
 
రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్టులు పెట్టుకునేలా ఇండోర్‌లో ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిరాకరించనున్నట్లు ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ వెల్లడించారు.
 
ఆదేశాలు ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏడాది జైలు శిక్ష లేదా రూ.5 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇండోర్ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇటీవల మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments