Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెల్మెట్ పెట్టుకుని బస్సును నడిపిన డ్రైవర్

Advertiesment
helmet

ఠాగూర్

, బుధవారం, 9 జులై 2025 (18:31 IST)
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు బుధవారం దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో దేశంలోని అన్ని సంఘాలకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అయితే, ఈ సమ్మెలో భాగంగా, కేరళ రాష్ట్రంలో ఓ వింత దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆందోళనకారుల దాడుల నుంచి తనను తాను రక్షించుకునేందుకు కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడపడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఈ రోజు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో పతనంతిట్ట నుంచి కొల్లాం బస్సు నడుపుతున్న షిబు థామస్ అనే డ్రైవర్ ముందు జాగ్రత్త చర్యగా హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యారు. బస్సులోని కండక్టర్ ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. సమ్మె సమయంలో హింసాత్మక ఘటనల జరగవచ్చన్న భయంతో డ్రైవర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, సమ్మెపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ప్రజాజీవనం స్తంభించకుండా బస్సులను యధావిధిగా నడిపింది. సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖామంత్రి కేబీ గణేశ్ కుమార్ ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లవ్ ప్రపోజల్‌ కోసం జలపాతంకు వెళ్లాడు.. ప్రేయసికి ఉంగరం చూపెట్టాడు.. నీటిలో జారుకున్నాడు..(video)