Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష వద్దు.. స్టే విధించిన హైకోర్టు.. స్టాలిన్ కొత్త ఎత్తుగడ

తమిళ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి దూకుడుకు కళ్లేం వేసేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ కొత్త ఎత్తుగడ వేశాడు. డీఎంకే ఎమ్మెల్యేలకు స్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (17:29 IST)
తమిళ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి దూకుడుకు కళ్లేం వేసేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ కొత్త ఎత్తుగడ వేశాడు. డీఎంకే ఎమ్మెల్యేలకు స్పీకర్‌ ధన్‌పాల్‌ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మూకుమ్మడిగా పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని స్టాలిన్‌ యోచిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తే -స్పీకర్‌ ధన్‌పాల్‌ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో శాసనసభలో బలపరీక్ష నిర్వహించొద్దని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో... తమపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ సదరు ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం బుధవారం విచారణను చేపట్టింది. 
 
విచారణ అనంతరం తీర్పును వెలువరించిన హైకోర్టు బలపరీక్షపై స్టే విధించింది. అదేవిధంగా అనర్హతపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 18 ఎమ్మెల్యేల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం