చరిత్ర పుటలకెక్కిన తెలుగింటి కోడలు... సైనిక దళాల సంక్షేమానికి పెద్దపీట

తెలుగింటి కోడలు చరిత్రపుటలకెక్కింది. దేశ పూర్తిస్థాయి రక్షణమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, రక్షణ శాఖను కొంతకాలం పాటు తన వద్దే ఉంచుకున్నారు.

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (12:38 IST)
తెలుగింటి కోడలు చరిత్రపుటలకెక్కింది. దేశ పూర్తిస్థాయి రక్షణమంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, రక్షణ శాఖను కొంతకాలం పాటు తన వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత రక్షణ శాఖ బాధ్యతలను ఏ ఒక్క మహిళా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రధాని చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా నిర్మలా సీతారామన్‌కు వాణిజ్య శాఖ సహాయ మంత్రి నుంచి రక్షణ శాఖా మంత్రిగా పదోన్నతి కల్పించారు.  
 
నిజానికి ర‌క్ష‌ణ మంత్రిగా మ‌నోహ‌ర్ పారిక‌ర్ రాజీనామా చేశాక‌.. అద‌నంగా ఇప్ప‌టివ‌ర‌కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆ శాఖకు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వచ్చారు. దీంతో అరుణ్ జైట్లీ నుంచి నిర్మ‌ల బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆమె తన సీటులో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రక్షణ శాఖను ఆధునికీకరించడమే తన లక్ష్యమన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధాల తయారీని చేపట్టనున్నట్టు వెల్లడించారు. సైనిక దళాల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.  
 
త‌న‌పై న‌మ్మ‌కంతో బాధ్య‌త‌లు అప్ప‌గించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆమె కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశారు. కాగా, రక్ష‌ణ మంత్రిగా నిర్మ‌లా సీతారామ‌న్ దేశ భద్రత కోసం ఏర్పాటు చేసిన కేబినేట్ క‌మిటీలో మెంబ‌ర్‌గా ఉండ‌నున్నారు. ఆ క‌మిటీలో ప్ర‌ధాని, హోం మంత్రి, విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రితో పాటు ర‌క్ష‌ణ మంత్రి కూడా మెంబ‌ర్‌గా ఉంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments