Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసులో 'ఉరిశిక్ష' అమలు చేయడానికి సర్వం సిద్ధం..?

Webdunia
గురువారం, 2 జనవరి 2020 (12:50 IST)
2012లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ కేసులో తీర్పు ఇప్పటివరకూ వాయిదా పడుతూ వచ్చింది, గత నెలలో పాటియాలా కోర్టు వారి రివ్యూ పిటీషన్‌ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే దోషులుగా తేలిన నలుగురిని ఒకేసారి ఉరితీయడానికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నలుగురు నిందితులకు ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. 
 
ఇందుకోసం తీహార్ జైల్లో నాలుగు ఉరికంబాలతో పాటు నాలుగు సొరంగాల నిర్మాణాన్ని జైలు అధికారులు పూర్తి చేసారు. ఈ కేసులో దోషులుగా రుజువైన వినయ్‌, పవన్‌, ముఖేష్‌ సింగ్‌, అక్షయ్‌ ఠాకూర్‌ అనే నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు. 
 
అయితే మరో నిందితుడైన రామ్ కుమార్ జైలులో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తమ కుమార్తెకు న్యాయం జరగలేదంటూ నిర్భయ తల్లిదండ్రులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments