Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ కేసు : ముద్దాయిలు గురువారం రాత్రి ఏం చేశారంటే?

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (09:44 IST)
నిర్భయ కేసులోని దోషులను శుక్రవారం ఉదయం సూర్యోదయానికి ముందే ఉరితీశారు. ఉరితీసిన తర్వాత ఆ నలుగురి శవాలను ఉరికంబానికి అర్థగంటపాటు వేలాడదీశారు. ఆ త‌ర్వాత శ‌వాల‌ను కింద‌కు దింపారు. ఈ నాలుగు మృతదేహాలకు ఢిల్లీలోని డీడీయూ ఆస్పత్రిలో శవపరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. కాగా, ఒక కేసులోని నలుగురు ముద్దాయిలను ఒకేసారి ఉరితీయడం భార‌తీయ న్యాయ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఇదిలావుంటే, శుక్రవారం సూర్యోదయానికి ముందే ఉరితీయడం ఖాయమని తేలిపోయిన తర్వాత నలుగురు దోషుల గదుల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ముద్దాయిలైన అక్ష‌య్ కుమార్‌, ప‌వ‌న్ గుప్తా, విన‌య్ శ‌ర్మ‌, ముకేశ్ సింగ్‌లు గురువారం రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోలేదు. రాత్రంతా జాగారం చేస్తూనే గడిపారని జైలు అధికారులు వెల్లడించారు. అలాగే, ఉరితీతకు ముందు జైలు అధికారులు అల్పాహారం అందించగా, వారిలో ఓ ముద్దాయి తీసుకోలేదు. 
 
అలాగే, జైలులో ఉన్న ఖైదీల్లో ఒక్క‌రు కూడా నిద్ర‌పోలేద‌ని అధికారులు వెల్ల‌డించారు. దోషులు మెడిక‌ల్‌గా ఫిట్ అని తేల్చిన త‌ర్వాత‌నే ఉరి తీశారు. న‌లుగురి శ‌వాల‌ను ప‌రిశీలించి, వారంతా మృతిచెందిన‌ట్లు తీహార్ జైలు డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ సందీప్ గోయ‌ల్ ప్ర‌క‌టించారు.  పోస్టుమార్టం కోసం మృతదేహాలను డీడీయూ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments