Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్భయ దోషులకు ఉరి ముహూర్తం ఖరారు... రూ.వేలు సంపాదించిన ముద్దాయిలు

Advertiesment
Nirbhaya Convicts
నిర్భయ కేసులో ముద్దాయిలుగా ఉన్న నలుగురు నిందితుల్లో ఇద్దరు దోషులు పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఈ దోషులకు ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఇందుకోసం తీహార్ జైలు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరిని మీరట్ జైలు తలారి పవన్ గుప్తా ఉరితీయనున్నారు. 
 
ఈనేపథ్యంలో ఈ నలుగురు ముద్దాయిలకు పెడుతున్న ఆహారాన్ని గణనీయంగా తగ్గించారు. అలాగే, ఈ దోషులు జైలులో ఇష్టానుసారంగా, అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వీరికి జైలు అధికారులు శిక్షలు కూడా అమలు చేశారు. ముఖ్యంగా, వినయ్ శర్మ అనుచితంగా ప్రవర్తించినందున 11 సార్లు శిక్షించారు. అలాగే, పవన్ గుప్తా 8 సార్లు, అక్షయ్ కుమార్ 3 సార్లు, ముఖేశ్ సింగ్ ఒకసారి శిక్షకు గురయ్యారని చెప్పారు.
 
మరోవైపు, ఈ నలుగురు దోషుల్లో ముగ్గురు జైల్లో వివిధ రకాల పనులు చేస్తూ కొన్ని వేల రూపాయలు సంపాదించారు. ముఖేశ్  సింగ్ 69 వేల రూపాయలు సంపాదించగా, వినయ్ శర్మ రూ.39 వేలు, పవన్ గుప్తా రూ.29 వేలు చొప్పున సంపాదించారు. ఈ మొత్తాన్ని ఉరితీత తర్వాత మృతదేహాలను అప్పగించే సమయంలో వారివారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నమ్మ పక్కలో నిద్రపోతున్న కుమార్తెను ఎత్తుకెళ్లి రేప్ చేసిన కన్నతండ్రి.. ఎక్కడ