Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో నిఫా వైరస్.. ఉత్తర మలప్పురం జిల్లాలో బాలుడికి పాజిటివ్?

సెల్వి
శనివారం, 20 జులై 2024 (19:56 IST)
కేరళలో నిఫా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శనివారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తర మలప్పురం జిల్లాలో వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
 
కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మలప్పురానికి చెందిన బాలుడికి నిఫాలక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు వైద్యులు. అతని శాంపిల్స్ పరీక్ష కోసం సెంట్రల్ ల్యాబ్‌కు పంపారు. ఆరోగ్య మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన ప్రకారం, తుది పరీక్ష ఫలితాలు ఇంకా అందలేదు. 
 
అయితే నిఫా ప్రోటోకాల్ ప్రకారం చర్యలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. గతంలో నాలుగు పర్యాయాలు రాష్ట్రాన్ని వణికించిన నిఫా వ్యాప్తి నివారణకు ప్రత్యేక కార్యాచరణ క్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎవరికీ సపోర్ట్ చేయరని తేల్చి చెప్పిన దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments