Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొమ్మిదేళ్ల బాలికపై దారుణం.. శరీరంపై 86 గాయాలు.. అత్యాచారం, హత్య

దేశవ్యాప్తంగా కలకలం రేపిన కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలను మరవకముందే.. మరో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని సూరత్‌లో తొమ్మిదేళ్ల బాలికను ఎనిమిది రోజుల పాటు అతి కిరాతకంగా అత్యాచారం

Webdunia
ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (13:11 IST)
దేశవ్యాప్తంగా కలకలం రేపిన కథువా, ఉన్నావో అత్యాచార ఘటనలను మరవకముందే.. మరో దారుణమైన అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని సూరత్‌లో తొమ్మిదేళ్ల బాలికను ఎనిమిది రోజుల పాటు అతి కిరాతకంగా అత్యాచారం, ఆపై హత్య చేశారు. అత్యాచారానికి గురైన బాలిక మృతదేహాం సూరత్‌లో లభ్యం కాగా, బాలిక శరీరంపై 86 గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 6న సూరత్‌లోని బెస్టాన్ ప్రాంతంలోని క్రికెట్ మైదానానికి సమీపంలో 9ఏళ్ల బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహానికి ఐదు గంటల పాటు సుదీర్ఘంగా పోస్టుమార్టం నిర్వహించగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు ఎనిమిది రోజుల పాటు బాలిక నరకయాతన అనుభవించిందని.. అత్యాచారం.. ఆపై గొంతునులిమి చంపేసినట్లు తేలింది. 
 
బాలిక శరీరంలోని పలు ప్రాంతాలతో పాటు ప్రైవేట్ భాగంలో 86 గాయాలు ఉన్నట్టు నిర్ధారించినట్టు పోస్టు మార్టం నివేదిక వెల్లడించింది.  అయితే చిన్నారికి మత్తు మందులు ఇచ్చారా లేదా అని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
 
అయితే బాలిక మృతదేహం గుర్తుపట్టలేనివిధంగా ఉందని, బాలికను దారుణంగా హత్య చేసిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని.. హత్యకేసు, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments