Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవజాత శిశువుకు, తల్లిదండ్రులకు, కుటుంబీకులకు కరోనా

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (19:53 IST)
కరోనా వైరస్‌కు చిన్నా పెద్దా అనే తేడా లేదు. పేద, గొప్ప అనే వ్యత్యాసం అస్సలు లేదు. తనకు దొరికిన వారిని దొరికినట్లు కాటేస్తున్న కోవిడ్-19కు నవజాత శిశువును కూడా సోకింది. రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో నవజాత శిశువుకు కరోనా సోకినట్లు డాకర్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నాగౌర్ జిల్లా బాస్నిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఓ మహిళ ప్రసవించింది.
 
ఐతే అప్పటికే ఆమెకు కరోనా ఉండడంతో వైద్యులు.. పుట్టిన శిశువుకు కూడా వైద్య పరీక్షలు చేశారు. దానికి సంబంధించి ఆదివారం నివేదిక రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. ఫలితంగా ఆ శిశువుతో పాటు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరికీ కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే నాగౌర్ జిల్లాలో ఇప్పటివరకు 59 మంది కరోనా బారినపడ్డారు. 
 
ఇంకా రాజస్థాన్ వైద్య ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 97 మంది కోలుకోగా.. 24 మంది మరణించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 1,373 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments