Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం : పెళ్లైన జంటలకు ఐదేళ్ల తర్వాత మాత్రమే సరోగసీ అవకాశం

పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టబద్ధంగా

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (09:43 IST)
పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు మాత్రమే (వివాహమైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే) ఈ విధానం ద్వారా పిల్లలు పొందేందుకు వీలు కల్పించనున్నారు. 
 
సరోగసీ (నియంత్రణ) బిల్లు 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అంగీకారం తెలిపింది. విదేశీయులు అక్రమంగా భారత్‌లో అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పెంచుకోవటంతో.. వాణిజ్య సరోగసీకి భారత్ కేంద్రంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు అమలయ్యాక అక్రమ చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. సెలబ్రిటీలు, డబ్బున్న కుటుంబాల్లో సరోగసి ద్వారా పిల్లలను కనటం ఫ్యాషన్ (పురిటి నొప్పుల బాధపడకుండా) అయిపోయిందని సుష్మ విమర్శించారు.  
 
ఈ బిల్లులోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. వివాహమైన ఐదేళ్లు దాటిన జంటలకే అవకాశం కల్పిస్తారు. భార్య వయసు 23-50 మధ్యలో, భర్త వయసు 26-55 మధ్యలో ఉండాల్సి ఉంటుంది. దంపతుల్లో ఒకరికి పిల్లలు కనేందుకు అవసరమైన సామర్థ్యం తక్కువగా ఉంది/లేదు అనే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. సంతానం లేని దంపతులకు మాత్రమే అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రులయ్యే వారికి మాత్రమే ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. అద్దెగర్భం ద్వారా పుట్టిన పిల్లలకు ఆస్తిపై సంపూర్ణ హక్కు కల్పిస్తారు. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ ఖచ్చితంగా వివాహిత అయి ఉండాలి.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments